లిప్సిక తాజా గానామృతం 'శ్రీ రామ్ దున్'

updated: March 25, 2018 12:49 IST
లిప్సిక తాజా గానామృతం 'శ్రీ రామ్ దున్'

 లిప్సిక , ఈ పేరు  యూట్యూబ్ లో ఒక సంచలనం.   లిప్సిక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఇంకా ఏడాది కూడా కాలేదు . కేవలం కొద్ది  నెలల వ్యవధి లో నే 85 వేల మంది  subscribers తో దూసుకు వెళ్ళిపోతోంది .  సినిమా రంగం లోనే కాకుండా యూట్యూబ్ ఆల్బమ్స్ లో తన స్థానం నిలపెట్టుకున్న లిప్సిక  శ్రీ రామ నవమి సందర్భం గా  ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ KKNKTV న్ టీవి వారు నిర్మించిన శీరామ ధున్ తో హరిహరిన్ తో కలిసి గళం కలపటం విశేషం.    

ఎవియన్ పవన్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పాటకు   లిప్సిక ఫిమేల్ వాయిస్ ని ఇచ్చారు.  లిప్సిక వాయిస్ ఈ పాటకు ప్రత్యేకతను తెచ్చి పెట్టిందనటంలో సందేహం లేదు. ఆమె కాకుండా ఈ పాటను వేరే వారి చేత ఊహించుకోలేమో అన్నంతగా అద్బుతం చేసేసింది. సినిమా పాటలే కాదు ఇలాంటి భక్తితో కూడిన పాటల్లో కూడా తనదైన ముద్ర వేయగలరని ఆమె నిరూపించారు. మరో విశేషం ఏమిటి అంటే వీళ్లిద్దరూ తెలుగు వాళ్లే హైదరాబాద్ నుంచి వచ్చిన వారే కావటం. 
 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: Lipsika, hariharan, kknktv, pavan kumar

comments